‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గంలో అపూర్వ స్పందన
సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు
ఈ ప్రభుత్వానికి , మంత్రి విడదల రజినికు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని ప్రజల ఆశీర్వాదం
చిలకలూరిపేట: అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. ఎదురేగి స్వాగతాలు.. అందరి నోటా ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రజాప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేసిన ఈ కార్యక్రమం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది.
గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని రాష్ట్రంలోనే రెండో స్థానంలో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రుల్లో గడపగడపకు క్రమంలో పాల్గొనే వారిలో మంత్రి విడదల రజిని రెండో స్థానంలో ఉన్నారు. ఒకవైపు శాఖా పరమైన కార్యక్రమాలు, మరోవైపు రాష్ట్రంలోని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటునే చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి రజిని గడపగడపకు కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజర్గంలో మొత్తం మీద 72 సచివాలయాలు ఉండగా... ఇప్పటివరకు మంత్రి రజిని 27 సచివాలయాలు గడపగడపకు తిరిగి పూర్తి చేశారు. పట్టణ పరిధిలోనే 18 సచివాలయాల పరిధిలో గడపగడపకు కార్యక్రమం పూర్తి చేశారు. గడపగడపకు మే నెలలో ప్రారంభం కాగా, ఈ కార్యక్రమంలో సచివాలయ పరిధిలో స్థానిక సమస్యలు పరిష్కరించటానికి ప్రతి రూ. 20 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలోని మౌలికసదుపాయాలు, సమస్యలను పరిష్కరించనున్నారు. గడపగడప కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఐదుగురు పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు, వందమందికి వివిధ ఆపరేషన్లు చేయించటానికి తన సహకారం అందజేశారు.
ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..
మంత్రి విడదల రజిని నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఊరువాడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. . గడప గడపకూ వస్తున్న మంత్రి రజినికి మహిళలు మంగళహారతులు పట్టి ఆహ్వానిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. . సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్కచెల్లెమ్మలు వివరిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఉన్నత చదువులు చదివించు కోగలిగామని.. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయని సంతోషంతో వివరించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా కట్టిస్తూ సొంతింటి కలను నెరవేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెబుతున్నారు.
అడుగడుగునా ఆపూర్వ ఆదరణ...
ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన హామీలు.. ఇంటి యజమానురాలైన అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ప్రతి ఇంటి వద్దకూ మంత్రి విడదల రజిని అందజేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 98 శాతం అమలు చేశామని గుర్తు చేస్తున్నారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు తెగేసి చెపుతున్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు మంత్రి విడదల రజిని ఆదేశాలు ఇస్తుండటంతో హర్షతీరేకాలు వ్యక్తమౌతున్నాయి.




