728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 10, 2023

చిలకలూరిపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అడ్డ‌గోలు రిజిస్ట్రేష‌న్లు... ప్ర‌భుత్వం నిర్ధేశించిన ప‌త్రాలు లేకుండా... స‌మీప స‌ర్వేనంబ‌ర్ల‌తో చీక‌టి వ్య‌వ‌హారం... ఉన్న‌తాధికారుల‌కు అందిన ఫిర్యాదుతో విచార‌ణ‌కు సిద్దం

చిల‌క‌లూరిపేట‌: ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఇక్క‌డ వ‌ర్తించ‌వు. సేవ‌ల‌కు ప్ర‌భుత్వం నిర్దేశించిన ఫీజులు ఇక్క‌డ క‌నిపించ‌వు. ప్ర‌భుత్వం ఆస్తులు రిజిస్ట్రేష‌న్ చేయ‌టానికి కొన్ని నిర్ధేశత ప్ర‌మాణాలను సూచించింది. ఇందుకు కొన్ని ప‌త్రాలు ఉంటే త‌ప్ప ఆస్తుల బ‌దలాయింపు, కొనుగోళ్లు, అమ్మ‌కాలు జ‌ర‌గ‌వు. కాని చిల‌క‌లూరిపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఎటువంటి ఆధారాలు, సంబంధిత ప‌త్రాలు లేకుండానే రిజిస్ట్రేస‌న్లు కొన‌సాగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా విన‌విస్తున్నాయి. 

ఆధారాల ప‌త్రాలు లేకుండానే అడ్డ‌గోలు రిజిస్ట్రేష‌న్లు... 
ఆస్తిలు అమ్మ‌కం, కొనుగోలు చేసే క్ర‌మంలో లింక్ డాక్య‌మెంట్లు, ఆ ఎలా సంక్ర‌మించింద‌నటానికి డాక్య‌మెంట్లు అవ‌స‌రమౌతాయి. వీటితో పాటు ఆ ఆస్తిని రిజిస్ట్రేష‌న్ క్ర‌మంలో అది ప్ర‌భుత్వ భూమా... నిషేదిత భూమా అని స‌రిచూసుకొని మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్లు చేయాలి. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని ఒక కాల‌నీలో గ‌తంలో ప్ర‌భుత్వం పేద‌ల‌కు నివేశ‌న స్థ‌లాలు ప‌ట్టాలు మంజూరు 
చేసింది. వీటిలో చాలా వ‌ర‌కు ఎటువంటి రిజిస్ట్రేష‌న్లు లేకుండానే ఒప్పంద ప‌త్రాల‌తో కొనుగోళ్లు, అమ్మాకాలు జ‌రిగాయి. కాని ఇదే కాల‌నీలో 2022 సంవ‌త్స‌రంలో 339 రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌టం విశేషం. వాటిలో 45 రిజిస్ట్రేష‌న్లు లింక్ డాక్యుమెంట్లు లేకుండానే కొన‌సాగాయి. వీటిని అమ్మ‌కాలు, కొనుగోలు జ‌ర‌ప‌టానికి ప్ర‌భుత్వం నిర్ధేశించిన స‌రైన డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేష‌న్లు చేయ‌టం గ‌మ‌నార్హ‌నం. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఏడాది జ‌న‌వ‌రి 17వ తేదీన ఇదే కాల‌నీలో జ‌రిగిన రిజిస్ట్రేష‌న్‌లో మున్సిప‌ల్ ప‌న్ను కూడా లేకుండా ప‌న్నువేయాల‌ని మున్సిపాలిటికి చేసిన మ్యుటేష‌న్ ర‌శీదు ఆధారంగా రిజిస్ట్రేష‌న్ జ‌రిగింది. దీంతో పాటు 7/1, 7/2 స‌ర్వే నంబ‌ర్ల‌లో ఉన్న ఆస్తుల‌ను 6, 9 స‌ర్వేనంబ‌ర్లులు వేసి రిజిస్ట్రేష‌న్లు చేశారు. ఇటువంటి రిజిస్ట్రేష‌న్ల కొన‌సాగే స‌మ‌యంలో వారికి కావాల్సింది ద‌క్కుతుంద‌ని, అందుకే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో జ‌రుగుతున్న త‌తంగంపై కొంత‌మంది రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికుల‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో చిల‌క‌లూరిపేట స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తుంది. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అడ్డ‌గోలు రిజిస్ట్రేష‌న్లు... ప్ర‌భుత్వం నిర్ధేశించిన ప‌త్రాలు లేకుండా... స‌మీప స‌ర్వేనంబ‌ర్ల‌తో చీక‌టి వ్య‌వ‌హారం... ఉన్న‌తాధికారుల‌కు అందిన ఫిర్యాదుతో విచార‌ణ‌కు సిద్దం Rating: 5 Reviewed By: NEWS UPDATE