చిలకలూరిపేట:
చిలకలూరిపేట మండలం కావూరు సమీపంలో మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్లా పడింది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని సుగాలికాలనీకి చెందిన 18 మంది మహిళలు నాదెండ్ల మండలం కనపర్రుకు వ్యవసాయ కూలీపనులకు వెళ్లి, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆటో కావూరు సమీపంలోకి రాగానే కుక్క అడ్డం రావటంతో దాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహకాన్ని కూడా ఢీకొట్టడంతో మల్లిఖార్జునరావు అనే వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆటో ప్రయణిస్తున్న 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు 108 సిబ్బంది వెంటనే స్పందించారు. గాయాలైన నలుగురిని చిలకలూరిపేట, ఆరుగురిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.


