728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 28, 2023

చిలకలూరిపేట: పొలాల్లో రోడ్డుకు కోటిన్నర ఎందుకు... 50వేల రూపాయలు పనులు చేయలేక లక్షల్లో పనులు పెడుతున్నారు... టిడిపి ప్రశ్నలను దీటుగా ఎదుర్కోని వైసీపీ కౌన్సిలర్లు


 చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగింది.  ఈ సమావేశానికి చైర్మన్ రఫానీ అధ్యక్షత వహించారు. సమావేశంలో 86 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. అయితే లక్షల లక్షలు పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ 50 వేల రూపాయలు పనికి కొబ్బరికాయ కొట్టి నెలలైనా ఎందుకు ఆ పని పూర్తి చేయలేదని ఎనిమిదవ వార్డు టిడిపి కౌన్సిలర్ కొత్త కుమారి ప్రశ్నించారు. లీకులకు సుమారు పాతిక లక్షలు కేటాయించారు. వాటర్ ట్యాంకర్లకు లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. అమృత్ పథకం కింద పధకం కింద పనులు ఎంతవరకు జరిగాయని ఆ పథకం పూర్తయితే మున్సిపాలిటీ కి కొన్ని లక్షల్లో నష్టం వాటిల్లకుండా ఉంటుందని కొత్త కుమారి చైర్మన్ ను ప్రశ్నించారు. అమృత్ పథకం త్వరలో పూర్తికానిందని చైర్మన్ సమాధానం ఇచ్చారు. పట్టణంలోని పురుషోత్తపట్నం లోని ఒక వ్యక్తి ఇంటి వద్ద నుండి పొలాల్లో స్వలాబాపేక్షతో  కోటిన్నర  రూపాయల నిధులు వెచ్చించి రోడ్డు వేశారని... పొలాల్లో రోడ్డు వేయవలసిన అవసరం వచ్చిందని ఈ నిధులు ఇతర వార్డులకు అభివృద్ధి పరంగా కేటాయించాల్సింది పోయి కోటిన్నర ఎందుకు వెచ్చించారని మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు ప్రశ్నించారు.  ఈ విషయంపై చైర్మన్  మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన కొన్ని లక్షలతో ఆర్చి ఎందుకు నిర్మించాలని ప్రశ్నించారు.  బైపాస్ రోడ్డు ఎందుకు వేస్తున్నారని... ఈ రోడ్డు వేయకూడదా అని ఎదురు ప్రశ్న వేశారు. బొందిలిపాలెం నుండి ఓగేరు  మీద బ్రిడ్జి కట్టడంపై తమ హయాంలో జరిగిందని గంగా శ్రీనివాసరావు వైసీపీ కౌన్సిలర్ పార్వతితో వాదన లాడారు. కె.బీ రోడ్లో బ్రాందీ షాపు ఆక్రమణలు ఎందుకు తొలగించలేదని గంగా శ్రీనివాసరావు ప్రశ్నించడంతో సమావేశము ముగిసింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పొలాల్లో రోడ్డుకు కోటిన్నర ఎందుకు... 50వేల రూపాయలు పనులు చేయలేక లక్షల్లో పనులు పెడుతున్నారు... టిడిపి ప్రశ్నలను దీటుగా ఎదుర్కోని వైసీపీ కౌన్సిలర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE