చిలకలూరిపేట: ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ము సీఎం జగన్మోహన్ రెడ్డికి వుందా అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. మాట్లాడితే టిడిపికి దత్త పుత్రుడు అని అనటం సరైంది కాదని ఆయన అన్నారు.. వైసిపి కు వున్న 151 సీట్లలో ఎంతమందికి వైసిపి తరఫున టికెట్లు ఇస్తావో చెప్పే దమ్ము నీకుందా అని మాజీ మంత్రి పుల్లారావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు. వైసిపి పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదని, టిడిపి తో పొత్తులు పెట్టుకోవడానికి అనేక పార్టీలు కలిసి వస్తున్నాయని ఆయన తెలిపారు.
రైతులకు ఇస్తున్న దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు తమ పత్రిక లో ప్రకటనలు ఇచ్చి తెనాలిలో బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి రైతులకు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండి పడ్డారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట రానున్నట్లు తెలిసి, స్థానిక మంత్రి పర్యటన చేపిసిందే గాని రైతులకు నష్టపరిహారం నేటికీ అందజేయలేదని ప్రత్తిపాటి తెలిపారు. రాష్ర్టంలో పత్తి మిర్చి రైతులు నష్టపోయారని వారికి నష్టపరిహారం ఎందుకు అందజేయలేదు పత్తిపాటి ప్రశ్నించారు. జగనన్న కాలనీల పేరిట జగనన్న కాలనీల పేరిట వేల కోట్లు దోచుకున్నారని, ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పేరిట ఆ పార్టీ వారు దోచుకున్నారని పత్తిపాటి తెలియజేశారు. తమ ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళకు నేటికీ గృహప్రవేశాలు జరగలేదని 4,500 ఇళ్లలో ఎంత మంది చేరారని తాము చేసిన అభివృద్ధిని సొంత అభివృద్ధిలో డబ్బా కొట్టుకుంటున్నారని వారు స్థానిక మంత్రి మీద విమర్శలు గుప్పించారు. పెట్రోలు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించి రేట్లు తగ్గించట్లేదని ప్రత్తిపాటి ప్రశ్నించారు. డీజిల్ పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించరని అన్నారు.
తమ ప్రభుత్వం రాగానే చిలకలూరిపేట లోని జర్నలిస్టులందరికీ తాము ఇచ్చిన స్థలాల్లో ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన తెలిపారు.

