ఎడ్లపాడు గ్రామానికి చెందిన రాచమంటి గంగయ్య (52) మంగళవారం పశువులు తీసుకొని పొలానికి వెళ్ళాడు. మధ్యాహ్నం వెళ్లి రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పంట పొలాలు కాలువలు అంతట వెతుకులాట ప్రారంభించారు. బుధవారం ఉదయం ఎడ్లపాడు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న పెదనందిపాడు బ్రాంచ్ కాలువ గట్టుపై చెప్పులు చేతి కర్ర ఉండటంతో కాలువను పరిశీలించారు. కాలువ సంపు వద్దనీటిపై తేలుతూ గంగయ్య శివమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని వెలికి తీసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు అయితే సాయంత్రం వేళ పశువులను శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగి పొరపాటున నీటిలో మునగటంతో ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గంగయ్య కు భార్య తిరుమల ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం: కాలువలో పడి వ్యక్తి మృతి