చిలకలూరిపేట: అనార్యోగం నుంచి విముక్తి కలిగించి ఆర్యోగ్యాన్ని అందించి మందులు ప్రాణానంతకం అవుతుంటాయి. అందుకే కొన్ని రకాల మందులను ప్రభుత్వం డాక్టర్ ప్రిషప్షన్ లేకుండా అమ్మకూడదని మందుల దుకాణాల వారికి స్సష్టం చేసింది. అలా మందులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని చట్టంలో పొందుపరిచింది. అయితే చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్ సెంటర్‌లో ఉన్న శ్రీలక్ష్మి గణపతి హోల్‌సెల్ అండ్ ఫ్యాన్సీ షాపు ఇందుకు అతీతంగా నిలుస్తుంది. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
అత్యధిక మంది వేర్వేరు ప్రాంతాలకు వెళ్లటానికి ఈ ప్రాంతం నుండే బస్సులు ఎక్కుతుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మందులు, వాటి దుష్పఫలితాలు తెలియవు. వారి వారి అనారోగ్య సమస్యలను బట్టి నేరుగా ఈ మందుల దుకాణంలో సంప్రదించటం, వైద్యుడి ప్రిషప్షన్ లేకుండానే నిషేదిత మందులు కూడా అందజేయటం జరుగుతున్న తంతే. ఉదాహరణకు మత్తుకు ఉపయోగించే ఆల్‌ఫ్రాజోల్, రెస్టిల్ మందులు బయటకు అమ్మరు. వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వినియోగించాల్సి ఉంటుంది. కాని మత్తుకు అలవాటు పడిన వారికి ఇవి నేరుగా ఇదే షాపులో లభ్యం కావటంతో వారు కొనుగోలు చేయటం జరుగుతుంది. ఇవి మోతాదుకు మించితే ప్రాణాంతకం అని కూడా తెలిసి మందులను విక్రయిస్తున్నారు. మరోవైపు యాంటిబయటిక్ మందులను వన్ ఎంజీ అమ్మకూడదు కాని వీటిని కూడా యధావిధిగా అమ్మటం విశేషం. ఇవి కాక మహిళలు గర్భస్రావం కోసం వినియోగించే మందులు కూడా డాక్టర్ ప్రిసెప్షెన్ కూడా అమ్మ అవకాశంలేదు. అయితే ఈ దుకాణంలో అవీ కూడా నేరుగా వైద్యుడి ధృవీకరణ లేకుండానే అమ్మటం ఈ మందుల దుకాణంలో నిత్యం కొనసాగుతున్న తంతే. జనరిక్ మందులు తక్కువ ధరకే లభ్యమౌతాయి. కాని మందుల గురించి అవగాహన లేని పేదలకు అధిక రేట్లకు వీటిని అంటగట్టడం జరుగుతుంది. శాంపిల్ మందులు కూడా ఇదే షాపులో లభ్యమౌతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం శాంపిల్ మందుల విక్రయాలు జరిపితే మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని ఇటీవల మందుల అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించిన విషయం విదితమే. అయితే మంత్రి నియోజకవర్గంలోనే ఈ మందుల దుకాణం యజమాని ఇటువంటి చర్యలకు పాల్పడటంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. ఇదే విషయంపై డ్రగ్స్ ఇన్సెపెక్టర్ సాంశివరావును వివరణ అడగానికి పోన్ ద్వారా ప్రయత్నించగా, ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.

