చిలకలూరిపేట: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. ఆంజనేయస్వామి గుడి సమీపము నుండి తాతపూడి వరకు, గణపవరం నుంచి ఏడ్లపాడు, మరియు నర్సారావుపేట రోడ్డు మార్గాల్లో వాహన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మంగళవారం పట్టణంలోని పోలిరెడ్డి పాలెం ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక ప్రాంతానికి చెందిన కంభంపాటి సుధీర్ బాబు(39) ద్విచక్ర వాహనంపై నరసరావుపేట వైపు వెళ్తుండగా చిలకలూరిపేట వైపు వస్తున్న మినీ ట్రాన్స్ పోర్ట్ వాహనం ఢీకొంది. దీంతో సుధీర్ బాబు రోడ్డుపై పడి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎంటి శోభన్ బాబు, పైలెట్ రాములు హుటాహుటిన సంఘటనాల స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే సుధీర్ బాబు మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బైకును ఢీకొన్న ట్రాన్స్పోర్ట్ వాహనం... వ్యక్తి మృతి, చిలకలూరిపేట లో రక్తసిక్తమవుతున్న రహదారులు