రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, ఇసుక మైనింగ్ మాఫియా వ్యాపారాలకు అండగా ఉండటానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో అన్నారు. చిలకలూరిపేట లోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్నాయని, ఒక్కొక్క గ్రానైట్ లారీ ఫ్యాక్టరీ నుండి వెళ్లిపోవడానికి ప్రభుత్వానికి సుమారు 60,000 నుంచి 70 వేలు కట్టవలసి ఉండగా మైనింగ్ మాఫియాగా ఏర్పడి ఒక్కో లారీకి 30 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి దాచుకోండి దోచుకోండి అనే చందంగా మారి ప్రజా ప్రతినిధులకు మైనింగ్ మాఫియా చేసుకోండి అని వరాలు ప్రకటించినట్లు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్ ఈ బి అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు పత్తిపాటి తెలిపారు. ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా గ్రానైట్ లారీలు రాష్ట్రం దాటుతున్నాయని... మీరు ఎవరైనా వస్తే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు పత్తిపాటి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంబంధిత శాఖల ద్వారా సమాచారం తీసుకొని వెంటనే మైనింగ్, గ్రానైట్, ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని పత్తిపాటి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేమని గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో అవకతవకలు జరిపినట్లు పుల్లారావు ఆరోపించారు. దొంగ ఓటర్లను చేర్పించుకొని గెలవాలని వైసిపి కుత్ర పన్నుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతులు వైసిపి ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారని రైతులను వైసిపి ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలియజేశారు..
దాచుకోండి దోచుకోండి అంటున్న సీఎం జగన్... విచ్చలవిడిగా ఇసుక మైనింగ్ మాఫియా...మాజీ మంత్రి పత్తిపాటి