చిలకలూరిపేట: పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యము AP 37 TA 8246 వాహనము ద్వారా చిలకలూరిపేటలోని బాలాజీ సినిమా హాలు రోడ్డు మార్గంలో అక్రమముగా రవాణా చేయుచున్నారని గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.పి. ఎస్.వి.మాధవ్ రెడ్డి కు రాబడిన విశ్వ్ససనీయ సమాచారం మేరకు సోమవారం విజిలెన్సు ఎన్ఫోర్స్ మెంట్ అదికారులు, చిలకలూరిపేటలోని బాలాజీ సినిమా హాలు దగ్గరలో వేచివుండి లారీ AP 37 TA 8246ని ఆపి తనిఖీలు నిర్వహించి 113 బస్తాల PDS బియ్యం (56.5 క్వింటాల్లు) అక్రమమార్గంలో రవాణా చేయుచున్నారు అని గుర్తించి, రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించి యర్రంశెట్టి సుబ్బారావు, వాహన యజమాని, గొట్టిపాటి శంకర్, వాహన డ్రైవర్ కాయల మురళి కృష్ణ, హమాలీ, శాప సైదావలి, మరియు షేక్ ఇమామ్ బుడే, హమాలీ మేస్త్రి, చిలకలూరిపేట అనువారలపై పంచనామా నిర్వహించి, సదరు PDS బియ్యం ను స్వాధీన పరచుకొని, 1955 నిత్యావసరాల చట్టం ప్రకారం 6(A) కేసు నమోదు చేసి, సదరు వ్యక్తులపై చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మారెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్.ప్రసాద్ , స్థానిక రెవెన్యూ అధికారి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో 113 బస్తాల రేషన్ (PDS) బియ్యం స్వాధీనం...కేసు నమోదు... పెట్రేగిపోతున్న రేషన్ మాఫియా