చిలకలూరిపేట: ప్రజా సేవ ద్వారా రాజకీయాల్లోకి ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్.. విస్త్రతంగా ప్రజలకు చేరువకావటానికి ఇది ఒక మార్గమని విశ్వసిస్తున్నారు. అందుకే చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు ఆశావాహాలు తమ పౌండేషన్ల ద్వారా సేవా కార్యక్రమాలు టీడీపీ, వైఎస్సార్ సీపీ టికెట్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి సీట్లు ఆశించేవారికి ఈ పోటీ బాగా ఉంది. ఈ పార్టీ టికెట్ ఆశిస్తూ ఇరువురు స్వచ్చంధ సేవా ప్రతినిధులు టికెట్లు ఆశిస్తుండగా, వైఎస్సార్ సీపీ మరోకరు టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ముందే వేడిక్కిన వాతావరణం...
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అయినా మరో నెలల్లోనే ఎన్నికలు వస్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణమే ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రజల్లో చొచ్చుకుపోవటానికి సేవా కార్యక్రమాల్లో కీలకమని పలువురు భావిస్తున్నారు. . గతంలోనూ 1999 ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ ఆశించిన నార్నే శ్రీనివాసరావు చిలకలూరిపేటలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదల దాహర్తిని తీర్చటానికి ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేశారు. అయితే ఆయన రాజకీయ ప్రవేశం నిలిచి పోవటంతో ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరుఫున రంగంలోకి వచ్చారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో వీఆర్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే మంత్రి విడదల రజని రాజకీయంగా అభివృధి చెందటానికి నాంది పలికిందని చెప్పవచ్చు.
రాజకీయాల్లో సక్సెస్ సాధ్యమేనా..?
వాస్తవంగా రాజకీయాలు ప్రజా సేవ కోసమే అని చెబుతుంటారు. ప్రజల్లో మమేకమవ్వడానికి పలువురు పలు మార్గాలను ఎంచుకుంటారు. ఏ రంగం నుంచి వచ్చినా అంతిమంగా రాజకీయాల్లో చేరడం, అధికారం చేపట్టడమే చివరి అంకం. సేవా కార్యక్రమాలను చూసి రాజకీయ పార్టీలు టికెట్టు కేటాయిస్తాయా.. అనేది వేరే అంశం . ప్రజల్లో చొచ్చుకుపోవటానికి, ప్రజల్లో ప్రచారం పొందటానికి ఒక మార్గం మాత్రమే. చిలకలూరిపేటలో ఇటీవల కాలంలో మాత్రమే ఈ నయా ట్రెండ్ కొనసాగుతుండగా, సేవా కార్యక్రమాలు అధికారానికి చేరువ చేస్తాయా అన్నది సందేహమే.

