చిలకలూరిపేట: శ్రామికుల కష్టాన్ని దోచుకుంటున్నారు ఆ పెట్రోల్ బంక్ యజమాని. చిలకలూరిపేట జాతీయ రహదారికి అనుకుని ఉన్న జూలకంటి ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బుంక్ యజమాని అక్కడ పనిచేసిన పంపు బాయ్ లకు జీతం ఇవ్వలేదని చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఒక వ్యక్తి అధికారులకు ఫిర్యాదులు చేసారు. సదరు జూలకంటి ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ప్రోప్రైటర్ కు చిలకలూరిపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నోటీస్ జారీ చేశారు. పెట్రోల్ బంక్ యజమానీ, ఫిర్యాదు దారుడు ఈనెల 24వ తేదీన చిలకలూరిపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయం కు హాజరై వారి వివరణ ఇవ్వాలని చిలకలూరిపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నోటీసులో పేర్కొన్నారు.
April 19, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: జీతం డబ్బులు ఎగ్గొట్టిన పెట్రోల్ బంక్ యజమాని... యజమానికి నోటీసులు జారీ చేసిన చిలకలూరిపేట లేబర్ అధికారి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

