చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కేవలం అరు అంశాలు మాత్రమే పెట్టడంతో కౌన్సిల్ సమావేశంలోని అన్ని అంశాలను చైర్మన్ రఫాన్ని అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు.
5000 కు కుళాయిల క్రమబద్ధీకరణ
పట్టణంలోని అనధికారికంగా ఉన్న కుళాయిలకు 6,500 కట్టవలసి ఉండగా 5 వేల రూపాయలు కట్టి కుళాయిలను రెగ్యులర్ చేసుకోవచ్చని కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదించారు.
సాయి కార్తీక్ సిటీ సెంటర్ పై వివాదం
అనంతరం టిడిపి ప్రతిపక్ష నేత గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ శుక్రవారం చిలకలూరిపేట పురపాలక సంఘంలో సాయి కార్తీక్ సిటీ సెంటర్ గురించి విలేకరుల సమావేశం పెట్టి మరి సాయి కార్తిక్ సిటీ సెంటర్ అతనికి కొన్ని పర్మిషన్ లేవని చెప్పడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి 2014లోనే అన్ని పర్మిషన్లు మున్సిపాలిటీ ఇచ్చిందని తెలిపారు. కేవలం సాయి కార్తీక్ సిటీ సెంటర్ 50 కోట్ల రూపాయల ఆస్తిని 10 కోట్లకి కొట్టాలని కొందరు పన్నాగం పన్నారని ఈ విషయం ఆ యజమాని బహిరంగంగా తెలిపారన్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం అని గంగా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ విషయంపై చైర్మన్ సమాధానం చెబుతూ సంజీవ్ నగర్ లో వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలిచిపోతుందని అందువల్ల సాయి కార్తిక్ సిటీ సెంటర్ ఎదురుగా కాలువలోని సిల్ట్ తీసామన్నరు. సంబంధిత అధికారులు 10 రోజుల్లో సరి చేస్తారని చైర్మన్ తెలిపారు. కొంతసేపు ఈ విషయంపై మాట్లాడిన అనంతరం....
మా ఊరి కి ఏమి చేశారు...ఉండాలా...వెళ్ళిపోవాలా..వైసిపి కౌన్సిలర్
పసుమర్రుకు చెందిన వైసిపి కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుండి తమ ఊరికి ఏ పని అడిగినా చేయటం లేదని.... మేము ఉండాలా వెళ్లిపోవాలా... అని చైర్మన్ ను నిలదీశారు.
నాలుగు ట్రక్కుల మట్టి వేపించలేక పోయ్యా...కో ఆప్షన్ మెంబర్
మున్సిపల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మస్తాన్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ స్మశాన వాటిక వద్ద నాలుగు ట్రక్కుల మట్టి అడుగుతుంటే చేయటం లేదు. మీ మీ ఇష్టం వచ్చిన చోట్ల పని చేస్తున్నారుగా అని చైర్మన్ ను అసంతృప్తితో ప్రశ్నించారు. పాలపక్ష సభ్యులే తమ పనులు కావటం లేదని ఈరోజు చైర్మన్ నిలదీశారు.
ఆధ్యక్షా ...కుక్కల బారి నుంచి కాపాడండి...వైసిపి, టిడిపి సభ్యులు
వైసిపి సభ్యుడు బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆదాయం లేదంటారు... కళామందిర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఎదురు ఉన్న కాంప్లెక్స్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆధ్యక్షా .... కుక్కలు వెంటపడుతున్నాయి... కుక్కలకు నేను కౌన్సిలర్ అని తెలియదు కదా.... ఈ విషయంలో అనేకమంది కౌన్సిల్ సభ్యులు బాధపడుతున్నారు. వెంటనే పరిస్థితి చక్కదిద్దండని తెలపడంతో టిడిపి, వైసిపి సభ్యులు మౌలాలి చెప్పిన విషయం నిజమే.... మేమంతా కుక్కల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు సుదీర్ఘ ఉపన్యాసం చేసి... వాటిని ఎలా కాపాడాలి ....నిబంధనలు ఏ విధంగా ఉంటాయో.... చెప్పి చిన్నగా కుక్కలు పడదాములే అని రూల్స్ మొత్తం చెప్పి హామీ ఇచ్చేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కుక్కల బెడద నుండి కాపాడుతామని.... మెప్మా విభాగం పై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పై విషయాలపై దృష్టి సారిస్తానని హామీ ఇవ్వడంతో కౌన్సిల్ సమావేశం ముగిసింది.

