చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జీలు ఆత్మహత్యల నిలయాలుగా మారుతున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు ఏటి ఇంటర్నేషనల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జిలో మరలా ఈరోజు ఒక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు సంవత్సరాల క్రితం నరసరావుపేట సెంటర్లోని లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అస్తిపంజరం మాత్రమే దొరకటం.. అప్పుడు చిలకలూరిపేట పట్టణంలో కలకలం రేగింది. ఈ రోజు గురువారం నరసరావుపేట సెంటర్లో గల AT ఇంటర్నేషనల్ లాడ్జిలో వాసు బాబు అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో ఒక స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగం చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. పట్టణంలోని రెడ్ల బజార్లో నివాసం ఉంటున్న వాసు బాబు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
April 13, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఆత్మహత్యల నిలయాలుగా మారుతున్న లాడ్జిలు... ఏటి ఇంటర్నేషనల్ లో వ్యక్తి ఆత్మహత్య
Rating: 5
Reviewed By: NEWS UPDATE

