చిలకలూరిపేట: అగ్రికల్చరల్ విద్యుత్ కనెక్షన్ కోసం 20 నెలల క్రితం దరఖాస్తు చేసిన రాని పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం కందా భాస్కరరావు 2021 ఆగస్టు 21వ తేదీన చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలోని 282-c1 సర్వేనెంబర్ లోని పొలానికి విద్యుత్ కనెక్షన్ కావాలని దరఖాస్తు చేశారు. దీనికోసం సుమారు 64000 ఖర్చు చేసి బోర్వెల్ కూడా వేయించారు. వాస్తవానికి ఆ పొలంలో 47 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పు లోపు ఉన్న నీటి కుంట కూడా ఉంది. తహసిల్దార్ కార్యాలయం వద్ద కూడా వాటర్ పర్మిషన్ లెటర్ కూడా తీసుకొని విద్యుత్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకునే ఉన్నాడు. అయితే సదరు అప్లికేషన్ తిరస్కరించబడిందని తెలుపటం వల్ల ...మరల కందా భాస్కరరావు 2022 ఆగస్టు 23వ తేదీన అగ్రికల్చర్ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు మరల పెట్టడం జరిగింది.
రెండు సంవత్సరాలైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో భాస్కరరావు స్పందన హెల్ప్ లైన్ కోసం చేసినా ఉపయోగం లేకుండా పోయిందని కావున విద్యుత్ అధికారులు స్పందించి.... లేదా జగనన్న స్పందన కార్యక్రమం ద్వారానైనా స్పందించి తనకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కందా భాస్కరరావు కోరుతున్నాడు.

