చిలకలూరిపేట:
చిలకలూరిపేట మున్సిపల్ సమావేశంలో నూతన దృశ్యం ఆవిష్కృతమైంది. విపక్ష టీడీపీ సభ్యులు మహానాడుకు తరలివెళ్లడంతో స్వపక్షమే విక్షంగా మారింది. సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లు గళమెత్తారు. ఊహించని విధంగా కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించటంతో చైర్మన్ రఫాని, అధికారులు ఖంగుతిన్నారు. రెండేళ్లు కావస్తున్నా ఏ పనులు చేయించలేకపోతున్నామని వాపోయారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, కుక్కలు, కోతుల సమస్య ను తీర్చలేకపోతున్నారని, తాగునీటి సమస్య వేధిస్తుందని ఫిర్యాదు చేశారు.

