చిలకలూరిపేట లో నకిలీ సిగరెట్ల దందాను అధికారులు గుట్టు రట్టు చేశారు. పట్టణంలోని చలివేంద్రం బజార్, కోమల విలాస్ ప్రాంతాలలోనీ దుకాణాల్లో విజిలెన్స్ ఎస్పి కె ఈశ్వరరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం శనివారం సాయంత్రం దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున నకిలీ సిగరెట్లు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో బాల సుజాత జనరల్ స్టోర్స్, చికోటి ఎంటర్ప్రైజెస్, సాయి ట్రేడర్స్ దుకాణాలలో పలు రకాల విదేశీ సిగరెట్ల తో పాటు నకిలీ బ్రాండ్ల సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 40 బండిల్స్ లో ఉన్న సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లలో ఐటిసి బ్రాండ్లను పోలిన నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు ఎస్పి తెలిపారు. మూడు దుకాణాల యజమానులతో పాటు, నకిలీ సిగరెట్లు సరఫరా చేసిన వరగాని సుధాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. దాడులలో విజిలెన్స్ సిఐ శ్రీనివాసరావు, ఎస్సై రామచంద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు.
July 15, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: విజిలెన్స్ అధికారుల దాడులు... భారీగా నకిలీ సిగరెట్లు పట్టివేత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

