728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2023

చిలకలూరిపేట: మ‌రో సంక్లిష్ట శ‌స్త్ర‌చికిత్స ద్వారా త‌ల్లి, శిశువును ర‌క్షించిన వ‌ర‌ల‌క్ష్మి వైద్యులు ఎనిమిది చుట్లుగా బొడ్డుతాడు మెడ‌లో ఉన్న శిశువు ను ర‌క్షించిన వైద్యులు


 చిల‌క‌లూరిపేట‌: ఎన్నో ఆసాధార‌ణ శ‌స్త్ర చికిత్స‌ల ద్వారా త‌ల్లి, బిడ్డ‌ల ఆరోగ్యానికి భ‌రోసా ఇస్తున్న చిల‌క‌లూరిపేట‌లోని వ‌ర‌ల‌క్ష్మి సంతాన సాఫ‌ల్య కేంద్రం   ఆసుప‌త్రి వైద్య‌లు మ‌రో అరుదైన శ‌స్త్ర చికిత్స చేసి త‌ల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడిన సంఘ‌ట‌న  గురువారం చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మండ‌లంలోని కోమ‌టినేనివారిపాలెం గ్రామానికి చెందిన షేక్ బేబి ప్ర‌స‌వ స‌మ‌యంలో ఇబ్బందులు త‌లెత్త‌యాయి. గ‌ర్బంలో ఉన్న శిశువు ప్ర‌స‌వ‌స‌మ‌యంలో  ఏకంగా ఎనిమిది చుట్లుగా బొడ్డుతాడు మెడ‌కు బిగుకుపోయి ఉంది.   గ‌మ‌నించిన వైద్యులు అత్యంత జాగ్ర‌త్త‌గా వాటిని తొల‌గించి శిశువు, త‌ల్లి ఆరోగ్యాన్ని కాపాడ‌గ‌లిగారు. 

సంక్లిష్ట శ‌స్త్ర‌చికిత్స‌.. 

తల్లిని పిండానికి అనుసంధానించే బొడ్డు తాడు గర్భం లోపల శిశువు అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. . ఇది గ‌ర్బంలోని శిశువుకు  రక్తం, ఆక్సిజన్, పోషకాలు, విటమిన్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లను అందిస్తుంది. వ్యర్థపదార్థాలు మరియు డీ-ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తిరిగి  విస‌ర్జించ‌టం కూడా  బొడ్డు తాడు ద్వారా నిర్వహించబడుతుంది. గర్భధారణ సమయంలో, శిశువు గర్భాశయం లోపల కదులుతూ ఉంటుంది, దీని ఫలితంగా త్రాడు మెడ చుట్టూ చుట్టబడుతుంది. సంక్లిష్టతను నూచల్ కార్డ్ అని కూడా పిలుస్తారు. 

త‌ల్లి,శిశువు ప్రాణాల‌ను కాపాడిన వ‌ర‌ల‌క్ష్మి వైద్యులు 

సాధారణ మరియు ఆరోగ్యకరమైన బొడ్డు తాడు "వార్టన్ జెల్లీ" అని పిలువబడే మృదువైన, జిలాటినస్ ఆకృతితో బాగా రక్షించబడుతుంది. ఈ పదార్ధం శిశువు గర్భాశయంలోకి ఎన్నిసార్లు తిరిగినా త్రాడు చిక్కుకోకుండా చేస్తుంది. త్రాడు పిండం యొక్క మొత్తం శరీరం చుట్టూ అల్లుకున్నప్పుడు బొడ్డు తాడు చిక్కుముడి ఏర్పడుతుంది. చాలా సార్లు, శిశువు మెడ చుట్టూ బొడ్డు తాడును వదులుగా అల్లుకొని ఉంటుంది, కానీ అది ఎటువంటి హాని కలిగించదు. అయితే ఇక్క‌డ  నూచల్ త్రాడు సంక్లిష్టంగా మారింది.  బేబి విష‌యంలో ఎనిమిది చుట్లుగా మెడ‌కు చుట్టుకొని ఉంది.  ప్రసవానికి ముందు అది పిండం యొక్క మెడ చుట్టూ గట్టిగా చుట్టినప్పుడు. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది  ప్రాణాప్రాయానికి దారి తీసే ఇటువంటి ప‌రిస్థితిని వ‌ర‌ల‌క్ష్మి ఆసుప‌త్రి వైద్యులు అధిగ‌మించి త‌ల్లి,బిడ్డ ఆరోగ్యాన్ని ర‌క్షించారు. దీంతో ప్రాణామాయం నుంచి త‌న‌కు, త‌న బిడ్డ‌కు ప్రాణ‌దాత‌లుగా మారిన వైద్యుల‌కు బేబి, కుటుంబ స‌భ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మ‌రో సంక్లిష్ట శ‌స్త్ర‌చికిత్స ద్వారా త‌ల్లి, శిశువును ర‌క్షించిన వ‌ర‌ల‌క్ష్మి వైద్యులు ఎనిమిది చుట్లుగా బొడ్డుతాడు మెడ‌లో ఉన్న శిశువు ను ర‌క్షించిన వైద్యులు Rating: 5 Reviewed By: NEWS UPDATE