728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2023

మా వార్డులను అభివృద్ధి చేయరా...!? మీ గ్రామాలతో మాకు సంబంధం లేదు... చైర్మన్ చైర్మన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ వార్డు కౌన్సిలర్లు


 చిలకలూరిపేట పురపాలక సంఘములో విలీనమైన రెండు పెద్ద గ్రామాలు పసుమర్రు, గణపవరం . పసుమర్రు గ్రామానికి పట్టణానికి మధ్య కేవలం బ్రిడ్జి మాత్రమే అడ్డుగా ఉంటుంది. పసుమర్తి గ్రామం పట్టణంలో కలిసిపోయే ఉంటుంది. ఆ గ్రామంలో రెండు వార్డులకు గాను ఒక వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు కాగా, మరో వార్డు కౌన్సిలర్ మస్తాన్ వలి. మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులో వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు.  జాలాది  సుబ్బారావు కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మా వార్డు ఎందుకు అభివృద్ధి చేయరు అని గత కొన్ని నెలల నుండి అడుగుతూనే ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం మేము కౌన్సిల్లో ఉండాలా వెళ్లాలా అని చైర్మన్ నిలదీశారు.   వార్డులో కావాల్సిన అభివృద్ధి పనులు చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.  సుమారు 50 లక్షల రూపాయల వరకు పనులు చేయాలని జాలాది కోరగా చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మాట్లాడుతూ కొన్ని నెలలుగా చెబుతున్నారు మా వార్డును అభివృద్ధి చేయరా !?మేము కౌన్సిలర్ గా ఉండాలా వద్దా !?అని మరలా చైర్మన్ నిలదీశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన వార్డు కౌన్సిలర్ మస్తాన్ వల్లి కూడా మా ఊరిని మర్చిపోయారా అని అడిగారు.


ఈ ప్రశ్నలతో  చైర్మన్ రఫాని మీ గ్రామానికి మున్సిపాలిటీకి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. మరి కౌన్సిల్లో మేమెందుకు గణపవరం, పసుమర్ కౌన్సిలర్లు బయటికి వెళ్దాం రండి అని జాలాది  సుబ్బారావు అన్నారు. మున్సిపాలిటీలో ఎందుకు కలిపారని అడగాకోర్టు కేసు ఉందన్నారు. చిలకలూరిపేట పట్టణంలో మానుకొండ వారి పాలెం,పసుమర్తి, గణపవరం గ్రామాలు కలిపే ఎన్నికల నిర్వహించారు.  ఆయా గ్రామాల నుండి 8 మంది కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. పట్టణంలో మొత్తం 30 వార్డులు కాగా,  ఆ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది కలిపి 38 మంది వార్డు సభ్యులు ఉన్నారు. గత కౌన్సిల్ సమావేశాల్లో కూడా మానుకొండ వారి పాలెం గ్రామానికి చెందిన కౌన్సిలర్ తీవ్ర అసంతృప్తితో తమ గ్రామంలో అభివృద్ధి పనులు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గణపవరం  గ్రామానికి చెందిన కౌన్సిలర్ కూడా తమ గ్రామంలో వార్డు సమస్యలు ఎందుకు పట్టించుకోరని గత కౌన్సిల్ సమావేశాల్లో నలిదీసిన సంగతి కూడా తెలిసిందే..


ఈ మూడు గ్రామాలకు చెందిన 8 వార్డుల్లో నలుగురు వార్డు సభ్యులు ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ విలీన గ్రామాలపై దృష్టి పెట్టి కోర్టులో ఉన్న కేసును పూర్తి చేసి పట్టణ పురపాలక సంఘంలో కలిపున్న తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని వార్డు సభ్యులు కోరుతున్నా... సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లు వ్యవరించడం ...చైర్మన్ ఆ గ్రామాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వార్డు సభ్యులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మా వార్డులను అభివృద్ధి చేయరా...!? మీ గ్రామాలతో మాకు సంబంధం లేదు... చైర్మన్ చైర్మన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ వార్డు కౌన్సిలర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE