728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2023

ఆఫ్ ద పీపుల్... బై ద పీపుల్...ఫర్ ద పీపుల్...మర్రి రాజశేఖర్


 చిలకలూరిపేట: వైఎస్సార్ , సోమేప‌ల్లి సాంబ‌య్య లాంటి నాయ‌కుల‌ను ఇప్ప‌టికి త‌లుచుకుంటారు. సోమేప‌ల్లి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ అంటే జ‌నం. పేద‌ల లాయ‌ర్‌గా  అప్ప‌టికే జ‌నంలో ఉన్న ఆయ‌న సోమేప‌ల్లి వార‌సుడుగా రాజ‌కీయాల్లో ర‌మ్మ‌ని ఆహ్వానించింది ఆ ప్ర‌జ‌లే ఇండి పెండెంట్ అభ్య‌ర్ధిగా రంగంలో దించారు. వారి ఆశ‌ల‌ను వ‌మ్ముచేయ‌కుండా ఎమ్మెల్యేగా రాజ‌శేఖ‌ర్ పేట ప్ర‌జ‌లకు చేరువ‌య్యారు.ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా..అధికారంలో ఉన్నా లేకున్నా... రాజ‌శేఖ‌ర్ మాత్రం ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఆయ‌న ఎప్పుడు రాజ‌కీయాలను వ్యాపారంగా మార్చుకోలేదు. సోమేప‌ల్లి స‌న్నిహితులు వైఎస్సార్ అధికారంలో ఉన్నా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోస‌మే పాటు ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త రోడ్లు, లోలెవ‌ల్ చాప్టాలు, ప‌సుమ‌ర్రు, న‌ర‌స‌రావుపేట‌, చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు మ‌ర్రి తో సాధ్య‌మైంది.

రాజ‌కీయ ప్ర‌వేశం ఇలా

పార్టీ ప‌ట్ల విధేయ‌త‌, అధినేత ప‌ట్ల విశ్వాసం.. అనునిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ్వ‌డం, ప్ర‌జా సేవ‌లో గ‌డ‌ప‌టం  ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ల‌క్ష‌ణాలు. మర్రిరాజశేఖర్ గుంటూరుజిల్లాలోని  ప్రత్తిపాడు నియోజవర్గంలోని తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో 15 ఆగస్టు 1957లో మర్రిరామలింగయ్య, హైమావతి దంపతులకు జన్మించారు. హైస్కూల్ వరకు ప్రత్తిపాడులో, పెదనందిపాడులో కామర్స్లో డిగ్రీ, గుంటూరు ఏసీ కళాశాలలో లా పూర్తి చేశారు. లా పూర్తియైన తరువాత చిలకలూరిపేటలో ప్రాక్టిస్ ప్రారంభించి 2003 వరకు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. లలితమ్మను 1983 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శ్రీనాధ్, కుమార్తె హిమబిందులు ఉన్నారు. తొలినుంచి మేనమామ సోమేపల్లికి రాజకీయల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నికల సమయాల్లో క్రియాశీలంగా వ్యవహరించేవారు. 2000 సంవత్సరంలో సోమేపల్లి మృతి అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ  ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు

ఇండిపెండింట్ గా విజ‌యం.. 

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఒడిదుడుకులకు లోనవుతుంటారు. అలాంటి వ్యక్తి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు.  2004లో  అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగా  సీటు కేటాయించ‌క‌పోవ‌టంతో చిల‌క‌లూరిపేట‌ నుంచి ఇండిపెండెంట్ గా  మర్రి రాజశేఖర్ పోటీ చేయాల్సి వచ్చింది.  కాంగ్రెస్ అధిష్టానం చివ‌రగా  తన మద్దతును మర్రి రాజశేఖర్ కు  ప్రకటించింది.  . దీంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బ‌రిలో ఉన్నా ఇండిపెండెంట్‌గా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ విజ‌యం సాధించారు. అనంత‌రం వైస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విధేయుడుగా ఉంటూ ఆయ‌న మ‌ర‌ణానంత‌రం    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ సీపీలో  చేరారు. తొలి నుంచి జగన్ వెంటే నడిచారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా అధ్య‌క్షుడుగా కొన‌సాగుతూ, పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. ఆ క్ర‌మంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో జిల్లాలో రాజీనామ చేసిన తిరిగి పోటీ చేసిన వారి గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. వైసిపి   గోదావరి, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఆ జిల్లాల్లో పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆఫ్ ద పీపుల్... బై ద పీపుల్...ఫర్ ద పీపుల్...మర్రి రాజశేఖర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE