చిలకలూరిపేట పురపాలక సంఘం పేరును కుంభకోణాల పురపాలక సంఘముగా పేరు గా మార్చి వేస్తున్నారని చిలకలూరిపేట పురపాలక సంఘ మాజీ ప్రతిపక్ష నేత జమాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం కుంభకోణాల మయమైందని మొన్న బీడీఆర్ లో , నిన్న అవుట్సోర్సింగ్ విభాగంలో కుంభకోణం, నేడు తాజాగా ఇనుము కుంభకోణం బయటపడిందని జమాల్ బాషా ఆరోపించారు. రోజు రోజుకు చిలకలూరిపేట పురపాలక సంఘంలో కుంభకోణాలు పెరిగి అవినీతిమయమైందని ఆయన సంబంధిత అధికారులపై విరుచుకుపడ్డారు. కుంభకోణాలు చేసిన వ్యక్తుల పై కేసులు పెట్టకుండా వారిని పురపాలక సంఘ, ప్రజా ప్రతినిధి సంబంధిత అధికారి కొమ్ము కాస్తున్నారన్నారు. ఆ కుంభకోణంలో వారి వాటా ఎంతని ఆయన ప్రశ్నించారు. ఇనుము అమ్మేటపుడు కనీసం కౌన్సిల్లో కూడా పెట్టకుండా ఒక ప్రైవేటు వ్యక్తికి 50 లక్షలు విలువైన ఇనుము ఇచ్చి వాటాలు పంచుకున్నట్లు తెలుస్తుందన్నారు. వీటన్నిటిపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారుల విచారణ జరిపించాలని జమాల్ భాష డిమాండ్ చేశారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ చెక్ పవర్ లేకుండా ఇక్కడ పని చేస్తున్నాడని, మంత్రి నియోజకవర్గంలో డేప్యూటేషన్ అధికారి ఉంటే ఇటువంటి అవకతవకలు జరుగుతూనే ఉంటాయని ఆయన తెలియజేశారు. స్థానిక మంత్రి పేరు చెప్పి పప్పు బెళ్లాలా కుంభకోణాలు చేస్తున్న ఈ పురపాలక సంఘాన్ని ప్రజలను రక్షించాలని జమాల్ బాషా కోరారు.
చిలకలూరిపేట పురపాలక సంఘం కుంభకోణాల సంఘంగా మారింది... నేడు మరో కుంభకోణం బయటపెట్టిన జమాల్ బాషా