728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 26, 2023

చిలకలూరిపేట:నిమ్మజనానికి వెళ్లి ఒకరు మృతి ,ఇద్దరి గల్లంతు...!


 నాదెండ్ల: మండలంలోని గణప వరం గ్రామ పరిధిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రవీణ్ అనే యువకుడు  మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం గణపవరం గ్రామంలోని ఒక స్పిన్నింగ్ మిల్లు లో పనిచేసే ముగ్గురు కార్మికులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలను వేలూరు డొంక పక్కనే ఉన్న ప్రభు బావి చెరువులో నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్లారు. చీకటి పడిన వెళ్లినివారు తిరిగి రాకపోవడంతో తోటి కార్మికులు వెతుకులాట జరిపి రాత్రి 9:00 సమయంలో చెరువు ఒడ్డున ఉన్న చెప్పులను గుర్తించారు. చెరువులో వెతుకులాట ప్రారంభించి ప్రవీణ్ మృత దేహాన్ని వెలికి తీశారు . కాగా మిగిలిన ఇద్దరి ఆచూకీ లభించలేదు. చెరువులోతు ఎక్కువగా ఉండటంతో ఆ ఇద్దరు చెరువులో కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు .స్పిన్నింగ్ మిల్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంగళవారం ఘనంగా నిమజ్జనం చేయాలని అనుకున్నారు .ఈ సంఘటన జరగటంతో ఆ కంపెనీ కార్మికు లలో వి షాదం నెలకొన్నది

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట:నిమ్మజనానికి వెళ్లి ఒకరు మృతి ,ఇద్దరి గల్లంతు...! Rating: 5 Reviewed By: NEWS UPDATE