728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 25, 2023

చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం లో పెరుగుతున్న అవినీతి ....ఏసీబీ అధికారులు దాడులు చేయాలి.. దళారుల ద్వారా కార్యాలయ అధికారులకు డబ్బు...నవతరం పార్టీ


నవతరంపార్టీ నేనున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆఫీసును జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పరిశీలించారు. నిరంతరం ప్రజలు వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఈ అంశంపై జిల్లా రిజిష్ట్రార్ దృష్టి సారించాలని అన్నారు.తుప్పు పట్టిన బెంచిలతో, చుట్టు పరిశుభ్రంగా లేని స్థితిలో కార్యాలయం ఉండటం శోచనీయం అన్నారు.దళారులు జోక్యం చేసుకోవడం గురించి ఫిర్యాదులు వస్తున్నాయని, అవినీతి నిరోధక శాఖ అధికారులు చిలకలూరిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. సిబ్బంది వివరాలు, జీతభత్యాలు,ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలు చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ అందించాలని కోరారు.రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారినుండి చలనా కాకుండా వసూళ్లు చేస్తున్నారు అని వస్తున్న ఫిర్యాదులు గురించి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రికి లేఖ రాస్తామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా ఇందుకు భిన్నంగా స్థానిక అధికారులు వ్యవరిస్తున్నారని రావుసుబ్రహ్మణ్యం అన్నారు.కార్యక్రమంలో నవతరంపార్టీ నేతలు చిలకలూరిపేట  నియోజకవర్గ ఇంఛార్జి బత్తుల అనిల్,చిలకలూరిపేట పట్టణ అధ్యక్షురాలు షేక్ షమ్మీ,బాపట్ల జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతి రావు,పర్చూరు నియోజకవర్గ కార్యదర్శి సిద్దు ఆత్మలింగాచారి, యద్దనపూడి మండల అధ్యక్షుడు గోనుగుంట్ల వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కొత్తమాసు నాగేశ్వరరావు,నార్నె రమేష్ బాబు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం లో పెరుగుతున్న అవినీతి ....ఏసీబీ అధికారులు దాడులు చేయాలి.. దళారుల ద్వారా కార్యాలయ అధికారులకు డబ్బు...నవతరం పార్టీ Rating: 5 Reviewed By: NEWS UPDATE