728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 3, 2023

చిలకలూరిపేట: పిడుగుపడి ఇద్దరు మృతి... ఇద్దరి పరిస్థితి విషమం

చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామ సమీపంలో సన్ సిటీ వెంచర్ వద్ద పిడుగు పడి అల్లూరి ఆరోగ్యం(58)  షేక్ అమీర్ (34)అను ఇద్దరూ అక్కడికి అక్కడే  మృతి చెందారు. మరొకరు కత్తి చిన్నబ్బాయి అనే అతనికి తీవ్ర గాయాల అవడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్సై రాజేషు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన ఇద్దరినీ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అల్లూరి ఆరోగ్యం మరియు షేక్ అమీర్ అను ఇద్దరూ చిలకలూరిపేట నుండి నరసరావుపేట వెళ్ళు మార్గంలో వర్షం పడటంతో లింగంగుంట్ల గ్రామ సమీపంలో ఉన్న సన్ సిటీ వెంచర్ వద్ద ఒక సోడ బండి దగ్గర దాదాపు 30 మంది తలదాచుకున్నారు. అంతలో పిడుగు పడడంతో అల్లూరి ఆరోగ్యం మరియు షేక్ అమీర్ అను ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారని మరొకరు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పిడుగుపడి ఇద్దరు మృతి... ఇద్దరి పరిస్థితి విషమం Rating: 5 Reviewed By: NEWS UPDATE