చిలకలూరిపేట:పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణ చేస్తున్న వాహనాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారంతో సోమవారం మండలంలోని గంగన్నపాలెం గ్రామ శివార్లలో రేషన్ బియ్యంతో ఉన్న అశోక్ లైలాండ్ లారీని సోదా చేశారు. ఇందులో మార్చకుండా 112 బస్తాల్లో రేషన్‌బియ్యంతో పాటు మరో 21 ప్లాస్టిక్ గోతాలలో ఉన్న బియ్యం 133 బస్తాల బియ్యాన్ని, లారీని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ యడ్లపాడు కు చెందిన ఇళవరపు నాగేశ్వరరావును అరెస్టు చేశారు. మొత్తం పట్టబడిన 66.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం విలువ రూ. 2.32లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. సోదాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐ ఎస్ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట: విజిలెన్స్ అధికారుల దాడుల్లో రేషన్ బియ్యం స్వాధీనం