చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జిగా మల్లెల రాజేష్ నాయుడు ను నియమించారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన విడదల రజనీ ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ అధిష్టానం నియమించింది. గత కొద్ది రోజులుగా మల్లెల రాజేష్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తూ వుంది. నియోజకవర్గంలో వైసిపి నాయకులను కలిసి ఏకధాటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయ పదాన నడిపించే దిశగా మల్లెల రాజేష్ నాయుడు పావులు కదిపారు. మల్లెల రాజేష్ నాయుడు ఎంఆర్ ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను మూడు తరాలుగా చేస్తూ ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. మల్లెల రాజేష్ నాయుడు కుటుంబం రాజకీయంగా ఎదిగిన కుటుంబం. వీరి తాత మల్లెల బుచ్చయ్య చిలకలూరిపేట మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్గా పనిచేశారు. దివంగత మల్లెల సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి కౌన్సిలర్ గా కూడా పనిచేశారు. ఇదే కోవలో మల్లెల రాజేష్ నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా తెచ్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఈయన పేరే ఎమ్మెల్యే అభ్యర్ధిగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా మల్లెల రాజేష్ నాయుడు... గుంటూరు పశ్చిమ ఇంచార్జిగా మంత్రి విడదల