728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 6, 2024

చిలకలూరిపేట: అసాధారణ డెలివరీ చేసిన వరలక్ష్మి వైద్యులు... తెలంగాణ రికార్డు బ్రేక్... సాధారణ డెలివరీతో ఐదు కేజీల పైనే శిశువుకు జన్మనిచ్చిన తల్లి

చిల‌క‌లూరిపేట‌: 
ఎన్నో ఆసాధార‌ణ శ‌స్త్ర చికిత్స‌లు సాధారణ ప్రసవాల ద్వారా త‌ల్లి, బిడ్డ‌ల ఆరోగ్యానికి భ‌రోసా ఇస్తున్న చిల‌క‌లూరిపేట‌లోని వ‌ర‌ల‌క్ష్మి సంతాన సాఫ‌ల్య ఆసుపత్రి వైద్య‌లు మ‌రో అరుదైన సాధారణ ప్రసవం చేసి త‌ల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

చిలకలూరిపేట మండ‌లంలోని కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన గౌరీ మొదటి ప్ర‌స‌వం కొరకు పట్టణంలోని వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో చేరింది. గ‌ర్బంలో ఉన్న శిశువు ప్ర‌స‌వ‌స‌మ‌యంలో సుమారు 5.10 కిలోల బరువు వున్నాడు. అయితే ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం పుట్టబోయే శిశువు బరువు 3.3 కేజీలు ఉంటే మాత్రమే సాధారణ ప్రసవం చేయవలసి ఉంటుంది. మూడున్నర కేజీలు దాటిన శిశువుకు వైద్యులు ఆపరేషన్ చేసి మాత్రమే బిడ్డను తీస్తారు. వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో కట్టుబడి వారిపాలెం కు చెందిన గౌరీ మొదటి ప్రసవ సమయంలో బేబీ 5.10 కిలోల పైనే ఉన్న సాధారణ డెలివరీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు వరలక్ష్మి వైద్యులు.

గతంలో నాలుగున్నర కిలోలు బరువున్న శిశువులకు సాధారణ డెలివరీ తెలంగాణలోని నిర్మల్ జిల్లా భద్రాచలం చెందిన ఒక మహిళ, హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో అరు కిలోల బరువుతో తెలంగాణలో రికార్డు బ్రేక్ చేసిన మరో మహిళ తదితరులు వున్నారు. అధిక బరువుతో ప్రసవించిన గాని వారికి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారానే బేబీకి జన్మనిచ్చారు. అయితే ఈ రికార్డులు అన్నిటిని అధిగమించి చిలకలూరిపేట వరలక్ష్మి ఆస్పత్రిలో 5.10 కిలోల బరువున్న మగ శిశువుకు ఆపరేషన్ లేకుండా సాధారణ డెలివరీ చేయటం అనేది అదొక రికార్డుగా చెప్పవచ్చు. అత్యంత క్లిష్టమైన కాన్పును ఆపరేషన్ లేకుండా సాధారణ కాన్పుగా చేసిన వరలక్ష్మి వైద్యులను పలువురు ప్రశంసిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అసాధారణ డెలివరీ చేసిన వరలక్ష్మి వైద్యులు... తెలంగాణ రికార్డు బ్రేక్... సాధారణ డెలివరీతో ఐదు కేజీల పైనే శిశువుకు జన్మనిచ్చిన తల్లి Rating: 5 Reviewed By: NEWS UPDATE