728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 20, 2024

చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఉద్రిక్తత... అర గంట సేపు అంగన్వాడీల నిరసన... అరెస్టులు



చిలకలూరిపేట పట్టణ జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్వాడీలు చేస్తున్న దీక్ష నేటికీ 40 రోజు చేరుకోవడంతో అంగన్వాడీలు నిరసన దీక్ష చేస్తున్న ప్రాంతం నుండి జాతీయ రహదారికి నిరసనగా రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దీక్షలో సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపైకి అంగన్వాడీలు రాకుండా అర్బన్ పోలీసులు తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే సిపిఐ సిపిఎం నాయకులు ఎం.సుబ్బారావు, వెంకటేశ్వర్లు, షేక్ సుభానిలు తీవ్రంగా పోలీసులను అడ్డుకొని ఒక దశలో అరెస్ట్ అయ్యారు. వారిని లాక్ వెళ్లి జీపు వరకు తీసుకువెళ్లారు. సిపిఎం నాయకులు సుబ్బారావు వయసు రీత్యా సృహ తప్పి రోడ్డుపై పడిపోయారు. అంగన్వాడీలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను అంగన్వాడీలను ఒకపక్క లాగుతూ ఉండటంతో మరోపక్క నుండి రోడ్డుపై నాయకులు పడుకొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జాతీయ రహదారి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలుతో మారుమోగిపోయింది. ఒక దశలో అంగన్వాడి మహిళల గాజులు పగిలి రోడ్డుపై అక్కడ రక్తపు చారలు కూడా పడ్డాయి. అరగంట నిరసన తర్వాత పోలీసులు వారందరినీ అరెస్ట్ చేయడంతో జాతీయ రహదారిపై నిరసన ముగిసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఉద్రిక్తత... అర గంట సేపు అంగన్వాడీల నిరసన... అరెస్టులు Rating: 5 Reviewed By: NEWS UPDATE