728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 29, 2024

చిలకలూరిపేట నుంచి వైసిపి అభ్యర్థి ఈయనే... ఎంపి విజయ సాయి రెడ్డి

చిలకలూరిపేట: సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం సందర్భంగా నూతన మార్కెట్ యార్డులో మీడియా సమావేశంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. 175 స్థానాలలో బస్సు యాత్ర చేసి వైసిపి అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి విడదల రజిని రాష్ట్ర నాయకులుగా భావించి గుంటూరు నుంచి పోటీ చేస్తున్నట్లు మంత్రి రజిని ఆశీస్సులతో చిలకలూరిపేటలో వైసిపి ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇదివరకు సర్వేల పేరు చెప్పి రాస్తున్న మీడియాకు రాజేష్ నాయుడు పేరు ప్రకటించడంతో కార్యకర్తలు వర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, వైసీపీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నుంచి వైసిపి అభ్యర్థి ఈయనే... ఎంపి విజయ సాయి రెడ్డి Rating: 5 Reviewed By: NEWS UPDATE