చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్ లాహిరి ఆసుపత్రి బజారు మాభు సుభాని జండా చెట్టు ఎదురు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సుభానీ నగర్ లో నివాసం ఉంటున్న పఠాన్ సుభాని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు విజయనగరం ఉరుసు సందర్భంగా విజయనగరము బయలుదేరి వెళ్లారు. అయితే బుధవారం తెల్లవారుజామున మూడున్నర సమయంలో పటాన్ సుభాని మామ కరిముల్లా ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి ఇంటి వద్దకు వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ పోలీసులు ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో వచ్చి ఇంటిని పరిశీలించారు. ఆ ఇంట్లో 25 వేల రూపాయల నగదు వెండి పట్టీలు, చెవులకు ధరించే బంగారు కమ్మలు దొంగలు దొంగలించుకుని వెళ్లి ఇంటి తలుపులను తెరిచే ఉంచారు. దొంగిలించిన డబ్బు బంగారం వెండి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని ఇంటి యజమాని తెలియజేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
February 21, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: సుభాని నగర్ లోనీ ఒక ఇంట్లో చోరీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE
