728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 29, 2024

మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు... కావాలనే తప్పుడు కేసులు పెట్టారన్న మాజీ మంత్రి పత్తిపాటి...

చిలకలూరిపేట: ఓటమిభయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాజకీయక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తమ కుమారుడు శరత్ పై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురదజల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు ప్రత్తిపాటి. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదన్నారు ప్రత్తిపాటి. ఈరోజు స్టేట్‌మెంట్ కోసం అని పిలిచి అదుపులోకి తీసుకున్నారని, వెంటనే అధికారపక్షం అనుకూల మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడానికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. అయితే అక్రమ కేసులకు భయపడేది లేదని...చట్టపరంగానే దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్ని సీఎం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమకు బురద అంటించలేరని.. అధికార పక్షం, వారికి తొత్తులుగా మారిన అధికారగణం మరోసారి న్యాయస్థానాల్లో నవ్వులపాలు కాక తప్పదన్నారు ప్రత్తిపాటి. మాకు బురద అంటించాలని చూస్తే అది మీకు అంటుకుంటుంది జాగ్రత్త అని హెచ్చరించారు. నిజానికి చిలకలూరిపేటలో వైకాపా, మంత్రి రజనీ వైఫల్యాలే వారి ఓటమికి బాటలు పరిచాయన్నారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకి ముందే గెలుపుఖాయమే బలమైన స్థాయికి చేరుకున్నాం అని ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ కేసుల రాజకీయానికి తెగబడ్డారన్నారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి పోటీగా నిలపడానికి కూడా అభ్యర్థులు దొరక్క వెదుక్కుంటోన్న వైకాపా నుంచి ఇంతకంటే ఏం ఆశించ లేమని చురకలు వేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందిని ముఖ్యమంత్రులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నా... జగన్‌ లాంటి సీఎంను, ఇలాంటి దివాళకోరుతనాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదన్నారు. ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. తమ కుమారుడికి కనీసం ముందస్తు నోటీసులు కూడా లేకుండా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున తనకు చిలకూరిపేట నియోజకవర్గం నుంచి సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే ఏపీఎస్‌డీఆర్ఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు... కావాలనే తప్పుడు కేసులు పెట్టారన్న మాజీ మంత్రి పత్తిపాటి... Rating: 5 Reviewed By: NEWS UPDATE