నాదెండ్ల మండలంలో గణపవరం గ్రామం అతిపెద్ద గ్రామపంచాయతీ. ఒకప్పుడు జిల్లాలోని అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి ఇచ్చిన పంచాయతీ గణపవరం గ్రామపంచాయతీ. గణపవరం గ్రామం సామాజికంగా, ఆర్థికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. గతంలో ఆ గ్రామపంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేసి గెలిస్తే...ఆ గ్రామానికి ఆ సర్పంచ్ ఎమ్మెల్యే గా చెప్పుకోవచ్చు.
కాగా నేడు గణపవరం గ్రామపంచాయతీ కాకుండా... మున్సిపల్ కాకుండా కోర్టు వివాదాల కారణంగా గణపవరం గ్రామపంచాయతీ అటు ఇటు కాకుండా పోయింది.
గణపవరం గ్రామానికి ఐదుగురు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అయితే కౌన్సిల్ సమావేశంలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతుంటే కోర్టు వివాదాల్లో ఉందని మున్సిపల్ అధికారులు సమాధానం చెబుతున్నారు. గ్రామపంచాయతీకి సంబంధించి పంచాయతీ విధులు యధావిధిగానే నడుస్తున్నాయి.
గణపవరం పంచాయతీ సిబ్బంది ఎంత మంది
గణపవరం గ్రామపంచాయతీ సంబంధించి సుమారుగా 48 మంది పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్రటరీ ఆఫీస్ ఎంప్లాయిస్, సానిటరీ, ఎలక్ట్రిసిటీ వాటర్, రెవెన్యూ తదితర సిబ్బందితోపాటు మొత్తం మీద 48 విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 48 మందికి సంవత్సరానికి సుమారు 70 లక్షల రూపాయలు జీతభత్యాలకే సరిపోతాయి.
గణపవరం ఆదాయం ఎంత
గణపవరం గ్రామానికి సంబంధించి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఆదాయం రావాల్సి ఉంది. గణపవరం గ్రామంలో 120 కంపెనీలు ఉన్నాయి. ఈ 120 కంపెనీలకు గాను సుమారుగా సంవత్సరానికి 70 నుండి 80 లక్షల రూపాయలు ఆదాయం రావలసి ఉంది. కానీ ప్రస్తుతం గణపవరం గ్రామంలో కంపెనీలకు రావలసిన బకాయిలు సుమారుగా 72 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది.
పంచాయతీకి నిధులు ఎక్కడ
గణపవరం గ్రామపంచాయతీకి వచ్చే పన్నుల రూపంలో 70 నుంచి 80 లక్షల రూపాయలు పంచాయతీ సిబ్బంది జీతభత్యాలకి సరిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే రూపాయి కూడా మిగలటం లేదని పంచాయతీ కార్యదర్శి వాపోతున్నారు. మరి తామేం చేయాలని మున్సిపాలిటీలో కలుపుకున్న గ్రామాన్ని మున్సిపాలిలో కలుపుకుంటే బాగుండేదని తామేం చేయలేని దిక్కుతో పరిస్థితుల్లో ఉన్నట్లు పంచాయతీ అధికారులు అంటున్నారు.
మంచినీటి పరిస్థితి
గ్రామానికి మంచి నీరు అందించడానికి పంచాయతీలో నిధులు లేవని గత మూడుసార్లు నుండి చిలకలూరిపేట పురపాలక సంఘం వారు సుమారు కొన్ని లక్షల రూపాయలు మంచినీటి చెరువుకు మంచినీరు వచ్చేలా చేశారు.
మంచినీటి చెరువులో మట్టి ఏమైంది
గత సంవత్సరం క్రితం మంచినీటి చెరువులో మంచినీరు నింపడానికి పూడిక కింద కొన్ని వందల ట్రాక్టర్ల మట్టిని కొంతమంది వ్యక్తులు అమ్ముకున్నట్లు గణపవరంలో ప్రచారం నేటికి జరుగుతూనే ఉంది.
పంచాయతీకి ఆదాయం రాకుండా ఎలా చేస్తున్నారు
మొత్తం మీద చూస్తే ఒకప్పుడు జిల్లాలోనే అత్యధిక రాబడి గల గ్రామపంచాయతీ నేడు జీతాలకు తప్ప ఒక రూపాయి అభివృద్ధి చేయడానికి కూడా పనికిరాకుండా పోవడం పట్ల పలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు అందిన కాడికి దోచుకోవటం తప్ప అభివృద్ధి చేయడానికి ఏముంది అంటున్నారు. ఉదాహరణకు సాయి కృష్ణ డెవలపర్స్ వారు సుమారు 27 ఎకరాల్లో వెంచర్ వేస్తే ల్యాండ్ కన్వర్షన్ కేవలం 13 ఎకరాల్లోనే చేయటం వల్ల పంచాయతీకి రావలసిన ల్యాండ్ కేవలం ఒక ఎకరం 30 సెంట్లు మాత్రమే. అదే పూర్తిస్థాయిలో ల్యాండ్ కన్వెన్షన్ చేపిచ్చి వెంచర్కు అనుమతి ఇచ్చినట్లయితే రెండెకరాల 70 సెంట్లు భూమి వచ్చి ఉండేదన్నారు. ఇలా పంచాయతీకి నష్టం వాటిల్లెలా ఎందుకు చేస్తున్నారని గణపవరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వరకు ఆ వెంచర్ ఫైల్ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
పుట్టగొడుగుల వెలుస్తున్న వెంచర్ల పరిస్థితి ఏమిటి
గణపవరం గ్రామ పరిధిలోని వావ్ కానుకొని ఒక వ్యక్తి వెంచర్ వేస్తే కనీసం నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. జిల్లాకు సంబంధించిన పుడా అధికారులు వచ్చి వీరికి నోటీసులు ఇచ్చారు. అదే ప్రాంతంలో గుడికి ఆనుకొని ఇంకొక వెంచర్ వెలుస్తున్నట్లు బోర్డు కూడా పెట్టారు మరి వీటిపై ఎందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. అధికారుల కార్యకలాపాలకు అడ్డుపడుతున్నది ఎవరో... ఆ ప్రజా ప్రతినిధి ఎవరో అందరికీ తెలుసు.

