చిలకలూరిపేట వైసిపి అసెంబ్లీ అభ్యర్థిగా గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది.
దీంతో చిలకలూరిపేట వైసీపీ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు తాను గడపగడపకు వెళ్లి ప్రచారం చేసి పోటీ చేస్తానని చెప్పటం ఒక పక్క అయితే.... మరోపక్క కౌన్సిలర్లు అందరూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రాజేష్ నాయుడు పేరును ప్రకటించకపోతే తాము కౌన్సిల్ సభ్యత్వాలు కూడా రాజీనామా చేస్తామని తెలపడంతో చిలకలూరిపేట వైసిపి పార్టీ లో గందరగోళానికి దారి తీసినట్లు తెలుస్తుంది.

