728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 21, 2024

జగన్ భక్త పోలీసుల తీరు ఇకనైనా మారాలి: ప్రత్తిపాటి


 చిలకలూరిపేట: ముగ్గురు ఎస్పీలకు ఎన్నికల సంఘం ప్రశ్నలతో అయినా జగన్ భక్త పోలీసుల తీరు మార్చుకుంటే మేలన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనాలు తగలబెట్టడం వంటి ఘటనలపై ఎస్పీలు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంలో తీవ్రతను ఇకనైనా వారు అర్థం చేసుకోవాలన్నారు. ఈసీ శ్రీముఖాలతో అయినా ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలు వైకాపా భక్తి మత్తు నుంచి బయటపడి విధినిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. కోడ్ వచ్చిన దగ్గర నుంచి జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ, హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీల్నే బాధ్యుల్ని చేస్తామని ఎన్నికల సంఘం ముందే ప్రకటించినా ఇప్పటికీ వైకాపా అరాచకాలకు కొమ్ము కాస్తుండడమే దారుణమైన విషయమని ఆయన ధ్వజమెత్తారు. పల్నాడు వంటి అత్యంత సమస్యాత్మక ప్రాంతానికి ఎస్పీగా ఉన్న వ్యక్తి కూడా ఈ జాబితాలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోన్న విషయమన్నారు. పోలీసులతో పాటు మిగిలిన అధికారులు కూడా కోడ్ అమల్లోకి వచ్చిన విషయాన్ని ఇకమీదటైనా గమనంలో పెట్టుకోకపోతే తర్వాత వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘం పదేపదే చెప్పినా రాజకీయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్న వాలంటీర్‌ వ్యవస్థపై కూడా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రత్తిపాటి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ భక్త పోలీసుల తీరు ఇకనైనా మారాలి: ప్రత్తిపాటి Rating: 5 Reviewed By: NEWS UPDATE