చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తొలగించి అసెంబ్లీ అభ్యర్థిగా గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు ను ప్రకటించారు.
అప్పటినుండి మల్లెల రాజేష్ నాయుడు వైఎస్ఆర్సిపి లోని కొంతమంది కౌన్సిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి 18 మంది కౌన్సిల్ సభ్యులతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు.
అయితే నేడు తాజాగా మల్లెల రాజేష్ నాయుడు తో పాటు 8 మంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్,ఎడ్లపాడు చెందిన జడ్పిటిసి సభ్యులు మరియు బీసీ సెల్ నాయకులు, వార్డు నాయకులు కొంతమంది హైదరాబాదులో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల సమక్షంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కానీ సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనీ విశ్వసనీయంగా తెలిసింది.

