చిలకలూరిపేట: నియోజకవర్గం లో తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓ వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమద్ది సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు ,మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాట్నల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, మల్లెల రాజేష్ నాయుడు, యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోల్డ్ శ్రీను, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు పాల్గొన్నారు.
ప్రత్తిపాటి సమక్షంలో కౌన్సిలర్, సర్పంచ్ తెలుగుదేశంలో చేరిక