చిలకలూరిపేట: పట్టణంలోని కృష్ణమహల్ రోడ్డు టీ నైన్ ఎదురు గల స్థలంలో అనధికారికంగా వెంచర్ వేసి విక్రయిస్తున్నట్లు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు సమాచారం తెలియజేశారు.
అనధికారికంగా రాళ్లు వేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారని... జిల్లా అధికారుల డిటిసిపి అప్రూవల్, చిలకలూరిపేట పురపాలక సంఘ అధికారుల అప్రూవల్ లేకుండా ప్లాట్లు వేస్తున్నట్లు దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పుడా వైస్ చైర్మన్ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు తెలియజేశారు.

