728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 7, 2024

చిలకలూరిపేటలో ఈ ప్లాట్ లు కొనవద్దు... రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సబ్ రిజిస్టార్కు మున్సిపల్ కమిషనర్ ఆదేశం

చిలకలూరిపేట: అనధికార వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్న యజమానులకు కొరడా ఝులిపించారు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్. చిలకలూరిపేట పట్టణంలోని సర్వే నెంబరు 83/1a లో గల స్థలంలో ప్రభుత్వ అప్రూవల్ లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వీటిపై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 22వ తేదీన చిలకలూరిపేట పురపాలక సంఘానికి పుడా అధికారులు లేఖను పంపారు.

జిల్లా అధికారులు లేఖతో చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ఆరోసి నెంబర్ 496912 / 2020/గ్1, తేదీ 05-03-2024 ప్రకారం అనధికార లేఔట్ లో ప్లాట్లు విక్రయించకూడదని, కృష్ణ మహల్ రోడ్లో గల టీ 9 ఎదురు గల ఈ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలిపివేయాలని చిలకలూరిపేట జాయింట్ సబ్ రిజిస్టార్కు లేఖను పంపారు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్. వీరితోపాటు నరసరావుపేట పుడా అధికారులకు, జిల్లా అధికారులకు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ కాపీను పంపినట్లు మున్సిపల్ కమిషనర్ లేఖలో ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఈ ప్లాట్ లు కొనవద్దు... రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సబ్ రిజిస్టార్కు మున్సిపల్ కమిషనర్ ఆదేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE