చిలకలూరిపేట నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గంలోని ఇళ్లను కొల్లగొట్టిన దొంగను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజనేయులు చెడు వ్యసనాలకు బానిసై తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టి ఆ బంగారం అమ్మి జల్సాలుకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గత నెల క్రితం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి న ఫిర్యాదులో భాగంగా చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసును చేదించారు. అతని వద్ద నుండి 42 సవర్ల బంగారం ఒక బైకును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
April 19, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: 30 లక్షల విలువ కలిగిన బంగారం బైకు స్వాధీనం... దొంగ అరెస్టు
Rating: 5
Reviewed By: NEWS UPDATE



