చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ. నిన్నటిదాకా కావటి మనోహర్ నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులతో వైసీపీని వీడి పత్తిపాటి ఆదేశాలతో నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరింది.
ఆమె అధికార పార్టీ వైసీపీ జడ్పిటిసి అయిన దగ్గర నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని నిర్ణయించుకుందన్నారు. అందుకోసమే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి నారా లోకేష్ సమక్షంలో కలిసి పార్టీలో చేరారు. చిలకలూరిపేట నియోజకవర్గ మూడు మండలాల్లో ఏడ్లపాడు, చిలకలూరిపేట మండల జడ్ పి టీ సీ లు ఇరువురు టిడిపి లో వున్నారు.

