728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 4, 2024

నేడు చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం... ఈరోజు సమావేశానికి హాజరుకాని కౌన్సిలర్ల సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశం..


 నేడు చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ చైర్మన్ రఫాని తెలియజేశారు. గత రెండు నెలల నుండి ఎటువంటి సమావేశాన్ని నిర్వహించలేదు. అయితే మూడు నెలల వరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోతే కౌన్సిల్ సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశం ఉండటంతో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు నిర్వహిస్తున్న సమావేశంలో వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన ఏడుగురు కౌన్సిల్ సభ్యులు ఎటువైపు కూర్చుంటారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. టిడిపికి 8 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా వైసీపీకి 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాగా ఇప్పుడు టిడిపికి 15 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరైతే కౌన్సిల్ సమావేశానికి హాజరు కారో వారి యొక్క కౌన్సిల్ సభ్యత్వాలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేటి సమావేశంలో పార్టీలకు చెందిన విషయాలు ఎన్నికలకు సంబంధించిన విషయాలు వచ్చి కౌన్సిల్ సమావేశం రసాభాస అవ్వనున్నట్లు తెలుస్తుంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం... ఈరోజు సమావేశానికి హాజరుకాని కౌన్సిలర్ల సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశం.. Rating: 5 Reviewed By: NEWS UPDATE