2019 శాసనసభ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో 2,23,809 ఓటర్లు ఉండగా 2024లో 2,25,245 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో 83.9% ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 2024 మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో 81. 5% పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.4 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని విస్తృత ప్రచారం చేసిన గాని పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తమకు రావలసిన డబ్బు అందలేదని బాహాటంగా ఉదయం పూట పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని 17 వ వార్డు వడ్డెర కాలనీ, రూతు డైక్న, సుగాలి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ పలు ప్రాంతాల్లో ఒక పార్టీ చెందిన నాయకుడు తమకు డబ్బు ఇవ్వలేదని మేము ఎందుకు ఓటు చేయాలని నిరసనలు వ్యక్తం చేసి బాహాటంగా తెలియజేశారు. దీంతో చిలకలూరిపేట మండల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిన కానీ పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే చెప్పవచ్చు. అధీను గాక సాయంత్రం పూట అరగంట వర్షం పడటంతో ఓటర్లు వుండటానికి సరైన సౌకర్యాలు లేకపోవడం జరిగింది. ఎండ ప్రాంతంలో అన్నిచోట్లా టెంట్లు లేకపోవడం అది ఒక కారణం కావచ్చు. ప్రతి పోలింగ్ బూత్ లో టెంట్లు ఏర్పాటు చేయవలసి ఉండగా కొన్నిచోట్ల నామాత్రంగా టెంట్లు ఏర్పాటు చేయటం, క్యూ లైన్ లో ఉండటానికి క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం దీంతో ఓటర్లు విసుగుతో అక్కడక్కడ వెను తిరిగి వెళ్లిన సంఘటనల వల్ల కూడా పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తగ్గిందని చెప్పవచ్చు.
చిలకలూరిపేటలో గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది... ఎందుకంటే!?