728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 15, 2024

అనుభవం లేని టిప్పర్ డ్రైవర్లు... టిప్పర్ బస్సు దహనంలో ఆరుగురు మృతి.... రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు!?


 చిలకలూరిపేట: బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ గురించి తెలియజేసిన వారి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. బాపట్ల జిల్లా చిన్నగంజాం పక్కగల గ్రామాల్లో గల కొందరు హైదరాబాదు వెళ్లటం కోసం  ఒక ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తుండగా రాత్రి ఒంటిగంట 30 నిమిషాలకు ఒక టిప్పర్ బస్ ను  ఢీకొనటం టిప్పర్ యొక్క ఆయిల్ ట్యాంకర్ పేలడంతో పెను ప్రమాదమే జరిగింది. మంటలు ఎగ్సిపడి బస్సు  టిప్పర్ను తగలబెట్టేసింది. బస్సులో డ్రైవరు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టిప్పర్ డ్రైవరు మొత్తం మీద ఆరుగురు మృతి చెందారు. అయితే వీరి మృతికి మూల్యం ఎవరు చెల్లించాలని బాధ్యత లేకుండా టిప్పర్లు ఎడాపెడా ఓవర్ స్పీడ్ తో పోవటం, ఎక్కువ ట్రిప్పులు వేయాలన్న ఆశతో టిప్పర్ ఓనర్లు నైపుణ్యం గల డ్రైవర్లను కాకుండా కేవలం క్లీనర్ గా పనిచేసే వారికి రాత్రులు టిప్పర్ లు  ఇవ్వటం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

టౌన్ లో హైస్పీడ్

చిలకలూరిపేట పట్టణంలో పగలే టిప్పర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్ళటం కేబి రోడ్డు గుండా  కొన్ని గ్రామాల్లో గ్రావెల్ తోలుతూ యదేచ్చగా పట్టపగలే స్పీడ్గా వెళ్లడంతో రోడ్లు పాడవటం, ప్రమాదాలు జరగటం నిత్య కృత్యాలు అయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గత కొద్దిరోజుల క్రితం ఓ టిప్పర్ ఒక ఇంట్లోకి దూసుకుపోయి ఒక వ్యక్తి ప్రాణాన్ని హరించింది.టిప్పర్ ఓనర్లు అత్యాశకు పోయి నైపుణ్యం లేని డ్రైవర్ల నియమించడం ఎక్కువ ట్రిప్పులు చేయించడం ఓవర్ స్పీడ్ తో బళ్ళు తోలు ఎలా చేయడంతో ఈరోజు ఆరుగురు మృత్యువాత పడి తమ కుటుంబాల్ని అనాధల్ని చేసి వెళ్లిపోయారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు!?

సంబంధిత టిప్పర్లు డ్రైవర్లు లైసెన్స్ ఉందా లేదా అనుభవం ఉందా లేదా అని పర్యవేక్షించాల్సి చెక్ చేయవలసిన రవాణా శాఖ అధికారులు ఎక్కడికి వెళ్లారని నిద్ర నటిస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు కోరుతున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అనుభవం లేని టిప్పర్ డ్రైవర్లు... టిప్పర్ బస్సు దహనంలో ఆరుగురు మృతి.... రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు!? Rating: 5 Reviewed By: NEWS UPDATE