చిలకలూరిపేట రూరల్: పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామంలో జరిగింది. మద్దిరాల గ్రామం పక్కనే గల ఓగేరు వాగు వద్ద వాగులో మోటర్ పెట్టి చొప్పదంటూ కు నీరు పెట్టడానికి చిలకలూరిపేట పట్టణానికి చెందిన వరగాని వెంకట్రావు (42 )మద్దిరాల గ్రామానికి చెందిన పరుచూరి శ్రీనివాసరావు (50 )మోటారు స్టార్ట్ చేయబోగా వీరిలో ఒక వ్యక్తి జారీ నీటి కుంటలో పడ్డాడు. ఇంతలో రెండో వ్యక్తి ఆ వ్యక్తిని లాగ పోయి ఇరువురు సుమారు 15, 20 అడుగుల లోతు గల నీటి కుంటలో ఇరుక్కుపోయి మృతి చెందారు. ఈ సంఘటన మద్దిరాల గ్రామంలో చోటుచేసుకుంది. అటుగా వెళుతున్న మేకలు కాసే కుర్రవాడు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఆ ఇరువురి యువకుల మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట్రావు మద్దిరాల గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, పర్చూరి శ్రీనివాసరావుల మృతితో ఇటు గాంధీపేట అటు మద్దిరాల గ్రామంలో విషాచాయలు చోటుచేసుకున్నాయి.
చిలకలూరిపేట వాగు కుంటలో పడి ఇరువురు మృతి.. మద్దిరాల, గాంధీ పేటలో విషాదం