చిలకలూరిపేట: 2024 మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు గెలుపు దిశగా పయనించారు. 24x7 NEWS UPDATE ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించగా... సుమారు 11,000 మంది అభిప్రాయ సేకరణ చేయగా వారిలో 52.08 శాతం పత్తిపాటి పుల్లారావుకు అనుకూలంగా, 45.71 శాతం కావటి మనోహర్ నాయుడుకు అనుకూలంగా మరియు 2.2% ప్రజలు ఇతరులకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గంలో 2,26, 646 మంది ఓటర్లు ఉండగా 1,92,649 ఓట్లు పోలయ్యాయి. 2400 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలుకాగా, 150 ఓట్లు 12 D కింద పోలయ్యాయి. ఈ ఓట్ల తో పాటు సర్వీస్ ఓట్లు 221 అధికారులు జారి చేయగా సుమారు 100 నుండి 125 ఓట్ల వరకు ఓట్లు వేసినట్లు తెలుస్తుంది.
కాగా ప్రత్తిపాటి పుల్లారావుకు 52.08 శాతం ప్రజాభిప్రాయాన్ని తెలియజేయగా, కావటి మనోహర్ నాయుడు కంటే 6.37% ఓట్లు పత్తిపాటి పుల్లారావుకు అధికంగా వచ్చేట్లు ప్రజాభిప్రాయ సర్వేలో తేలింది. కావటీ మనోహర్ నాయుడు కు 45.71 శాతం ప్రజలు ప్రజాభిప్రాయాన్ని తెలిపారు. పుల్లారావు కంటే కావటి మనోహర్ నాయుడు కు 6.37% ఓట్లు తగ్గినట్లు తెలుస్తుంది. మొత్తం మీద పత్తిపాటి పుల్లారావుకు 12 వేల నుండి 1 8వేల లోపు మెజార్టీ రానున్నట్లు 24x7 NEWS UPDATE సర్వేలో తేలింది.
అయితే గత శాసన సభ ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికల్లో 8 వేల ఓట్ల మైనస్ లో ఉన్న ప్రతిపాటి పుల్లారావు ఈ ఎన్నికల్లో 8వేల ఓట్లను పూడ్చుకొని సుమారు 12 నుండి 18 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే, గతంలో వచ్చిన మైనస్ ఓట్లు పూడ్చుకుని 18 వేల లోపు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తెలుస్తుంది.