చిలకలూరిపేట: ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన ఇరువురు పిడుగుపాటుకు మృతి చెందారు. గ్రామంలోని ఆచార్య చెరువు వద్ద పొలాలను గొర్రె దున్నేందుకు పెద్ది చిన్న వీరయ్య, చిరుతల శ్రీనివాసరావు చేరో ట్రాక్టర్ తో ఆదివారం తెల్లవారుజామున గొర్రు దున్నేందుకు వెళ్లారు, గురు దున్నే సమయంలో పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఇద్దరూ ట్రాక్టర్లు దిగి సమీపంలో ఉన్న వేప చెట్టు నీడకి చేరారు, అదే సమయంలో వారు నిలుచున్న చెట్టుపై పిడుగు పడి ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు, పెద్ది చిన్న వీరయ్య (50), భార్య రాజేశ్వరి కుమారుడు కుమార్తె ఉన్నారు, చిరుతల శ్రీనివాసరావు (50) భార్య వీరమ్మ కుమారుడు కుమార్తె ఉన్నారు, గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఎడ్లపాడు తహసిల్దార్ మొహమ్మద్ అష్రి ఫున్నిసా బేగం సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
June 2, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE