చిలకలూరిపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడుగులేనంత మెజార్టీని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు కట్టబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే పత్తిపాటి పుల్లారావు స్థానిక నాయకుడిగా ఉన్నారు. కావటి మనోహర్ నాయుడు నాన్ లోకల్ అభ్యర్థిగా బరిలో దిగారు. చిలకలూరిపేట ప్రజలు ఎప్పుడు స్థానిక నాయకుడినే ఎన్నుకుంటారు.
ఈసారి కూడా చిలకలూరిపేట ప్రజలు లోకల్ అభ్యర్థి అయిన ప్రత్తిపాటి పుల్లారావుకు బ్రహ్మరథం పట్టారు. పత్తిపాటి పుల్లారావు గెలుపులో ఆయన సతీమణి పత్తిపాటి వెంకట కుమారి, ఆయన కుమారుడు పత్తిపాటి శరత్, కుమార్తె స్వాతి కూడా భాగమనే చెప్పాలి. మండుటెండను సైతం లెక్కచేయకుండా వీరు తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టనున్న సూపర్ ఫిక్స్ పథకాలను ప్రచారం చేసి లోకల్ నాయకుడైన ప్రతిపాటీ పుల్లారావు కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఒకానొక సమయంలో పత్తిపాటి వెంకట కుమారి కన్నీటి పర్యంతమై ఓట్లు అడిగారు. దీంతో మహిళలు సైతం పత్తిపాటి పుల్లారావుకు ఎక్కువ శాతం ఓట్లేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పత్తిపాటి పుల్లారావు లోకల్ నాయకుడుగా ఉండటం, స్థానికులకు అందుబాటులో ఉండటం, గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయటం అదే అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మరలా తన భుజస్కందాలపై ఆగిపోయిన అభివృద్ధి పనులు చేయాలని మీడియాకు ప్రత్తిపాటి వివరించడం ఇవన్నీ పత్తిపాటి పుల్లారావుకు అనుకూలంగా లాభించి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ప్రతిపాటి పుల్లారావుకు ఓట్లు వేసినట్లు చెప్పవచ్చు.