2024 ఏప్రిల్ మే నెలలో వచ్చిన ఎండలు గత 100 సంవత్సరాలు క్రితం నమోదయాయని విశ్లేషకులు తెలిపారు. అయితే ఎండవేడికి తాళలేక జనం అల్లాడుతూ మంచినీళ్లు దొరక్క బాటిల్ ₹20 పెట్టి కొన్న సంఘటన కోకోల్లలు.
చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో మంచినీటి చలివేంద్రాలు గతంలో నిక్కొచిగా ఏర్పాటు చేసి బిల్లులు చేసేవారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ప్రస్తుత 2024 సంవత్సరంలో నామమాత్రంగా నాలుగు తాటి ఆకులు, రెండు కుండలు, ఒక ఫ్లెక్సీ, ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి కేవలం మున్సిపల్ వాటర్ నింపి నాలుగు రోజులు మాత్రమే మంచి నీటి చలివేంద్రాలు నడిపిన మున్సిపల్ కాంట్రాక్టర్ మున్సిపల్ సిబ్బంది తీరుపై చిలకలూరిపేటలో సర్వత్ర విమర్శలు వెలువెత్తు తున్నాయి.
చిలకలూరిపేట పట్టణంలో ఐదారుచోట్ల మంచినీటి చలివేంద్రాలు పెట్టినట్టు తాటాకులు వేసి, గ్లాసులు పెట్టి రెండు రోజులు నామమాత్రంగా చలివేంద్రాలు నడిపి లక్షలకు లక్షలు బిల్లులు వసూలు చేయటం ఏమిటని పురపాలక సంఘ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు బాహటంగా విమర్శిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఇవే కాకుండా మంచినీటి చెరువుకు నీరు నింపటం మరియు ఒకే కాంట్రాక్టర్ చిలకలూరిపేట పురపాలక సంఘాన్ని శాసించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘ పరిధిలో జరిగిన పనులపై లక్షల్లో బిల్లు చేసుకున్న కాంట్రాక్టర్లపై ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరపాలని టిడిపి కౌన్సిలర్లు పలువురు కోరుతున్నారు.