చిలకలూరిపేట: ఇతను మున్సిపల్ చైర్మన్ కాదు... మున్సిపల్ ఎంప్లాయ్ అంతకన్నా కాదు... మునిసిపల్ బిల్లులను దోచేసే వ్యక్తి లాగా చలామణి అవుతుంటాడు. అతను ఒక పేరు మోసిన కాంట్రాక్టర్.... అతని కను సన్నల్లోనే మున్సిపల్ పరిపాలన జరగాలి... ఏ టెండర్ పిలవాలన్న ఏ కాంట్రాక్టు సైన్ కావాలన్నా ఏ బిల్లు కావాలన్నా ఇతను చెప్పిందే ఫైనల్... ఇంతకాలం అతని మాట అందరూ విన్నారు... అదేమంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మీకు ఏసీబీ కు పట్టిస్తానని మున్సిపల్ కిందిస్థాయి అధికారులను బెదిరించాడు ఆ బడా కాంట్రాక్టర్...
చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఏ పని జరగాలన్న అతనిది అందవేసిన చేయి... చేసేది పావలా పని... బిల్లులు తీసుకునేది రూపాయి... అతనివి ఎక్కడున్నా చకచకా బిల్లులు పాస్ అవుతాయి.... మున్సిపల్ ఎంప్లాయిస్ కు జీతాలు రాకపోయినా అతనికి మాత్రం బిల్లులు ఇస్తూ ఉంటారు సంబంధిత అధికారులు... కోట్లకు కోట్లు పురపాలక సంఘంలో పనులు చేసి తన బిల్లు రాబట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుంది ఆ కాంట్రాక్టర్ కి... అయితే ఇదంతా గతం...
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన గాని అతని బిల్లులు ఎంచక్కా చేయించుకోవడానికి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని సైతం బిల్లులు చేయించుకుంటున్నాడు ఆ కాంట్రాక్టర్. సుమారు కోట్ల రూపాయల్లో తన బిల్లులు చేయమని నూతన ప్రజాప్రతినిధులు అడ్డుకుంటారేమోనని చెప్పి ఎంచక్కా బిల్లులు పెట్టించుకుంటున్నాడు ఆ కాంట్రాక్టర్... శంకుస్థాపన చేసేటపుడు కొబ్బరికాయలకు టెంట్లకు 50,000.ఖర్చు. అదే రోడ్డు ప్రారంభిస్తే ఇంకో 50,000 అదనం ఇవన్నీ కాంట్రాక్టర్ చేయాల్సిన పనులు అయితే వీటికి కూడా బిల్లు తీసుకుంటాడు.
ఈ విషయం పై ఒక పార్టీ రాష్ట్ర నాయకుడు గతంలో అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ కాంట్రాక్టర్ పై కొంతమంది కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు విజిలెన్స్ అధికారులకు గత రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు విశ్వసినియంగా తెలిసింది. ఈ ఫిర్యాదులో భాగంగా అధికారులు కొందరు ఈయన చేసిన కాంట్రాక్టు పనుల పై విచారణ జరిపితే గాని అసలు విషయం బయటపడదు.
చిలకలూరిపేట పురపాలక సంఘంలో పాత కాంటాక్ట్ పనులకు బిల్లులు చెల్లించకుండా పూర్తిస్థాయిలో నూతనంగా వచ్చిన ప్రభుత్వ ఉన్నత అధికారులు విచారణ జరిపి అవి సక్రమంగా జరిగినవా లేదా అని విచారణ జరిపి వాటికి బిల్లులు చేయాలని పలువురు కౌన్సిలర్లు కోరుతున్నారు.