చిలకలూరిపేట: నియోజకవర్గంలో 33 వేల మెజార్టీతో గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు కు మంత్రి పదవి దక్క వచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లాలో అత్యధిక మెజార్టీ పొందటంలో రెండవ స్థానంలో ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు బలంగా ఉండేలా చేయడంలో సఫలం అయ్యాడని చెప్పవచ్చు.
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు చిలకలూరిపేట జాతియ రహదారిపై చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను ఒక గంట సేపు ఆపడంతో చిలకలూరిపేట పేరు రాష్ట్రంలో మారుమోగిపోయింది. చంద్రబాబు నాయుడు సైతం పత్తిపాటి పుల్లారావు కు ఫోన్ చేసి తన కాన్వాయ్ వెళ్ళటానికి దారి నివ్వాలని చెప్పడంతో పత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడు దారి వదిలారు.
అలానే ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడి పక్కన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పార్టీలతో మొట్టమొదటి ప్రజాగళం సభను నిర్వహించడంలో ప్రతిపాటి పుల్లారావు విజయం సాధించారు. దేశంలోనే మొట్టమొదటి సభను నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి రావడం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనూహ్య మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో పత్తిపాటి పుల్లారావు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను గంటసేపు ఆపడం, ప్రజాగళం సభను నిర్వహించడంతో చిలకలూరిపేట పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేయడంతో పత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు నాయుడు వద్ద లోకేష్ వద్ద మంచి గుర్తింపు లభించింది. దీంతో రాష్ట్ర క్యాబినెట్లో పత్తిపాటి పుల్లారావుకు బెర్తు ఖాయమని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ వ్యక్తిగా పేరు పొందటం గత ప్రభుత్వంలో ఐదు శాఖలు విజయవంతంగా నిర్వహించడంలో పత్తిపాటి పుల్లారావు కీలకంగా వ్యవహరించారు. ఈసారి క్యాబినెట్ లో పత్తిపాటి పుల్లారావుకు క్యాబినెట్ మంత్రిగా లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.